calender_icon.png 27 September, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ లీజులకు ఈఎంఎస్ అండ

27-09-2025 12:43:36 AM

  1. పారదర్శకతే లక్ష్యంగా బల్దియా సరికొత్త యాప్
  2. ఈ యాప్‌తో పెరగనున్న జవాబుదారీతనం, సామర్థ్యం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెఎంసీ పరిధిలోని ఆస్తుల లీజుల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు, చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేసేందుకు బల్దియా డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది.

పురపాలక మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, లీజు స్థలాల లీజుదారులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ చెల్లింపులను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసేందుకు వీలుగా ‘ఎస్టేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఈఎంఎస్’ అనే నూతన అప్లికేషన్‌ను అందుబా టులోకి తెచ్చింది. ఈ నెల 24న జరిగిన జీహెఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈఎంఎస్ యాప్ ద్వా రా లీజుదారులు తమ లీజు, అద్దెకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవ చ్చు. చెల్లించాల్సిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే క్షణాల్లో చెల్లించవచ్చు. దీనివల్ల మానవ ప్రమేయం గణనీయంగా తగ్గి, లంచాలకు, జాప్యానికి ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా వ్యవస్థలో జవా బుదారీతనం, సామర్థ్యం పెరగనున్నాయి.

‘ఈఎంఎస్’ యాప్ ముఖ్య ప్రయోజనాలు..

రియల్‌టైమ్ సమాచారం: వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా రూపొం దించిన ఈ యాప్‌లో డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ వివరాలు ఎప్పటికప్పుడు నిజ సమయంలో కనిపిస్తాయి.

సులభమైన పర్యవేక్షణ: క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ప్రధాన కార్యాలయం వరకు ఆస్తుల నిర్వహణ, వసూళ్ల ప్రక్రియను పర్యవేక్షించడం ఉన్నతాధికారులకు సులభతరం అవుతుంది.

ప్రజలకు సౌలభ్యం: లీజుదారులు తమ చెల్లింపుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే శ్రమ తప్పుతుంది. సమయం ఆదా అవడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సేవలు పొందవచ్చు. ఈ సందర్భంగా జీహెఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, పురపాలక ఆస్తుల నిర్వహణను బలోపేతం చేయడంలో, వాటి నుంచి రాబడిని మరింత సమర్థవంతంగా రాబట్టడంలో ఈ డిజిటల్ వేదిక కీలక పాత్ర పోషిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ సం స్కరణతో జీహెఎంసీ ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలు మరింత గాడిన పడతాయని అధికారులు భావిస్తున్నారు.