కబ్జా అవుతున్న దళితుల భూములు
16-06-2024 12:05 AM
ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి:హనుమంతరావు
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంచిన భూములు కబ్జాకు గురవుతున్నాయని కాంగ్రెస్ నేత హనుమంతరావు ఆరోపించారు. ఈ విష యాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. గాంధీభవన్‌లో శనివారం మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా కీసరలో 1981లో అప్పటి కాంగ్రె స్ ప్రభుత్వం 10 మంది దళిత కుటుంబాలకు 94 ఎకరాలు పంపిణీ చేసిం దన్నారు. అదే గ్రామానికి చెందిన రాగి కృష్ణారెడ్డి, రాగి దేవేందర్‌రెడ్డి కలిసి దళితులు తిరిగి ఆ భూములను తమకు అమ్మినట్టు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు ఉండగానే హెచ్‌ఎండీఏలో ప్లానింగ్ అధికారి బాలకృష్ణ తో కలిసి లేఅవుట్ చేసి అమ్ముకుంటున్నారని తెలిపారు.






