16 June, 2026 | 12:22 PM

బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్ రూ.387.51 కోట్లు విడుదల

16-06-2024 12:05 AM
  1. బీసీ ఓవర్సీస్ పథకానికి రూ. 15 కోట్లు 
  2. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్‌కు సంబంధించి రూ. 387 కోట్ల 51 లక్ష 63 వేల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం గాను మొదటి త్రైమాసికానికి గాను ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ  శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా మహాత్మాజ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద రూ. 15 కోట్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.