ముగిసిన ప్రజాపాలన సంస్కృతిక కార్యక్రమాలు
భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. డిసెంబర్ ఒకటి నుంచి నేటి వరకు భద్రాచల దేవస్థానంలోని చిత్రకూట మండపంలో సాంస్కృతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ తొమ్మిది రోజులు సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన అందించిన స్థానిక బాల బాలికలకు అలాగే పాల్వంచ మణుగూరు నుంచి వచ్చినటువంటి బాలికలకు సైతం భద్రాచల రామచంద్రమూర్తి అనుగ్రహం అందాలని ఈవో ఎల్ రమాదేవి కోరారు. వారందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీంద్రనాథ్, ఏఈవోలు శ్రవణ్ కుమార్, భవాని రామకృష్ణ, పర్యవేక్షకులు సాయిబాబా, కిషోర్ గారు, అరుణ్ కుమార్ వేద పండితులు, అర్చకులు పుర ప్రముఖులు అనేకమంది విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.






