30-07-2025 04:20:15 PM
లండన్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఆఖరి సమరానికి సిద్దమైంది. గురువారం నుంచి లండన్‌లోని ఓవల్ మైదానం(Oval Ground) వేదికగా ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సమయంలో టీమిండియా-ఇంగ్లండ్ చివరి మ్యాచ్(Team India-England last match)కు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరంగా ఉండనున్నారు. అదనంగా జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్ కూడా ఓవల్‌లో ఆడటానికి దూరంగా ఉంటారు.
కుడి భుజానికి గాయం కావడంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ జట్టులోకి రాలేకపోతున్నారని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) బుధవారం ధృవీకరించింది. స్పిన్నర్ లియామ్ డాసన్, పేస్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడాన్ కార్స్ కూడా జట్టులో లేరని ప్రకటించిన ఈసీబీ ఇంగ్లాండ్ జట్టులో నాలుగు మార్పులు చేసింది. ఇందులో జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ ఉన్నారని, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నిర్ణయాత్మక ఆటకు ఓలీ పోప్ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టుకు నాయకత్వం వహిస్తాడని వెల్లడించింది.
చివరి టెస్టు కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్ (వీక్లీ), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్,