calender_icon.png 24 May, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులైన చిన్నపిల్లలను ఐఈడీ పాఠశాలలో చేర్పించండి

24-05-2025 12:00:00 AM

కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ 

భద్రాద్రి కొత్తగూడెం, మే 23 (విజయక్రాంతి) ః విద్యాశాఖ, ఐసిడిఎస్ శాఖల అధికారులు సం యుక్తంగా జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులైన చిన్నారులను గుర్తించి ఐ ఈ డి పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. శుక్రవారం ఐ డి ఓ సి లో దివ్యాంగుల, వయావృద్ధుల జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఐ డి ఓ సి లో జరిగింది.

ఈ సమావేశంలో  ఆయన పాల్గొని మాట్లాడుతూ దివ్యాంగులైన చిన్నపిల్లలకు విద్య  ముఖ్యమని, డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్, స్పెషల్ ఎడ్యుకేషన్,  ఐ.ఈ.డి. స్కూల్స్ నందు మౌలిక సదు పాయాలు కల్పిస్తామని జిల్లా విద్యాశాఖ, ఐసిడిఎస్ అధికారులు శ్రద్ధ వహించి దివ్యాంగ పిల్లలను గుర్తించి పాఠశాలకు పంపే విధంగా తగు చర్యలు తీసుకోలన్నారు.

ఆర్.బి.కే.ఎస్. వాహనం ద్వారా చెక్ అప్స్, హోం విజిట్స్, ఎడ్యుకేషన్, భవిత స్కూల్స్ ద్వారా అలవెన్సులు, స్కాలర్షిప్లు మంజూరు చేస్తారని,  వాటిని కచ్చితంగా అమలు చేసేటట్లు చూస్తామని, అన్ని సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, బ్యాక్లాగ్ వేకెన్సీస్ నింపుటకు చర్యలు తీసుకుంటామని,  యూ.డి.ఐ.డి. కార్డులు మంజూరు చేయుటకు , సదరు సమస్యలను పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హులైన ది వ్యాంగులకు పనులు  కల్పిస్తామని, అన్ని ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలు నందు ర్యాంపులు లేని చోట ర్యాంపులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు., సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా అంత్యోదయ కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, బ్యాటరీ ఆపరేటర్ సైకిల్స్ రిపేర్ చేయుటకు టెక్నీషియన్లను నియమిస్తామని, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన వంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ సద్వినియోగం చేసుకోగలన్నా రు.

జిల్లా వయోవృద్ధుల కొరకు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, వెల్నెస్ సెంటర్  ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, జిల్లాలోని అన్ని మండలాలలో ఆయుర్వేదిక్ క్యాంపులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో రోహిత్ రాజ్ జిల్లా ఎస్పీ, , వేణుగోపాల్ అడిషనల్ కలెక్టర్, డి.అనసూర్య ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎస్. జయలక్ష్మి అడిషనల్ డిఎంహెచ్‌ఓ, సిహెచ్ రాజేష్ మెప్మా పీడి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కే.శ్రీ రామ్, జిల్లా ఇండస్ట్రియల్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి, ఈ.ఇందిరా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, కే. సంజీవరావు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, డి మధు ఆర్డిఓ కొత్తగూడెం, డి. దామోదర్ రావు ఆర్డీవో భద్రాచలం, ఈడి ఎస్సీ కార్పొరేషన్ ఆర్ ఉపేందర్, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, సిడిపివోలు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.