24-05-2025 12:00:00 AM
-బాలబాలికలకు మెరుగైన విద్యను అందించాలి
-నిర్మల్ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేలా చర్యలు
-నకిలీ వ్యవసాయ విత్తనాల అమ్మకానికి అడ్డుకట్ట వేయాలి
-కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, మే 23 (విజయక్రాంతి): జిల్లాలో బాల్యవివాహాలకు పూర్తి స్థాయిలో నియంత్రించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్యవివాహా ల నిర్మూలన, లింగ నిర్ధారణ పరీక్షల నిషే ధం, మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, ఇసుక అక్రమ రవాణా, మున్సిపల్ అంశాలు, రహదారి భద్ర త, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ తదితర అంశాలపై సం బంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బాల్యవివాహాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. గత రెండు సంవత్సరాలలో జిల్లాలో 29 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చెప్పారు. బాల్య వివా హాలు జరుతున్నట్లు తెలిసిన వెంటనే సం బంధిత అధికారులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, బాల్య వివాహాలను ప్రోత్సహించినవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరచూ గ్రామాలను సందర్శిస్తూ మళ్ళీ వివాహం జరపకుండా చూడాలన్నారు.
సంబంధిత బాలబాలికలకు మెరుగైన విద్యను అందించాలన్నారు. జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు, రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాలను తనిఖీలు చేస్తూ, కేంద్రాలలో పనిచేస్తున్న వారి అర్హత పత్రాలను వైద్య శాఖ అధికారులు సరిచూడాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆర్‌ఎంపిలు ప్రథమ చికిత్స తప్ప, ఏ ఇతర చికిత్సలను చేయకుండా నియంత్రించాలని ఆదేశించా రు. నిర్మల్ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గంజాయి, నాటు సారా ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాను గుర్తిం చి, కేసులు నమోదు చేయాలన్నారు. విద్యా సంస్థల 400 మీటర్ల పరిధిలో గుట్కా, సిగరెట్ అమ్మకాలను నిషేధించాలన్నారు. యు వత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అధిక ప్రమా దాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలన్నారు. తరచూ ప్రమాదాలు సంభవించే ప్రదేశాల్లో సూచికల బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి ప్రమాదాలు నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసు ల విచారణ వేగవంతంగా ఉండాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్య లు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. నకిలీ వ్యవసాయ విత్తనాల అమ్మకానికి అడ్డుకట్ట వేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటి కప్పుడు ఎరువులు, విత్తనాల దుకాణాలు తనిఖీలు చేయాలన్నారు.
విత్తనాల నాణ్యతపై అనుమానాలు ఉంటే నాణ్యతా పరీక్షల కు పంపాలని, నిషేధించిన విత్తనాలు, పురుగుల మందుల వాడకంపై నిషేధం పకడ్బం దీగా అమలు చేయాలన్నారు. నకిలీ విత్తనా లు, పురుగుల మందులు విక్రయించిన దుకాణదారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవా ణాను పూర్తి స్థాయి లో నియంత్రించాలని, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అక్రమ రవాణాను అరి కట్టాలన్నారు.
అక్రమంగా ఇసుక త్రవ్వకాలు చేపట్టినా, నిల్వ ఉంచిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుం డా చూడాలన్నారు. గృహ, ఇతర నిర్మాణాల అవసరాలకు రుసుములు చెల్లించి, రసీదు లు పొందిన వారికి మాత్రమే ఇసుకను సరఫరా చేయాలని ఆమె ఆదేశించారు.
అనంతరం ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, బాల్య వివాహాలను నిరోధించడానికి సంక్షేమ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని అన్నారు. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే ట్రాఫిక్, మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల నియం త్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ మత్తుపదార్థాల వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని తెలిపారు.
గంజా, నిషేదిత మత్తుపదార్థాలు వినియోగించిన, రవాణా చేసిన టోల్ ప్రీ నెంబర్ 100 లేదా 8712659599 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. అనం తరం గంజా, నిషేదిత మత్తుపదార్థాల నిషేధంపై అధికారులతో కలిసి పోస్టర్లను కలెక్టర్, ఎస్పీలు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదనపు ఎస్పీలు అవినాష్ కుమా ర్, రాజేష్ మీనా, ఉపేంద్ర రెడ్డి, సంక్షేమ, వైద్యారోగ్య, పోలీసు, అబ్కారీ, ఆర్ అండ్ బి, మున్సిపల్, రెవెన్యూ, వ్యవసాయ, విద్యా శాఖల అధికారులు పాల్గొన్నారు.