24-05-2025 05:11:04 PM
పాడ్ బ్యాండ్ డీజే సామాగ్రి తిరిగి ఇచ్చేందుకు ఎస్సై లంచం డిమాండ్..
బాధితుల నుండి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడ్డ ఎస్సై శంకర్..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్(Jagadgirigutta Police Station) లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శంకర్(SI Shankar)పై ఏసీబీ అధికారులు శనివారం రైడ్ చేశారు. జగద్గిరిగుట్టలో హరి కమల్ పాడ్ బ్యాండ్ అనే డీజే నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై గత కొద్ది రోజుల క్రితం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎస్సై శంకర్ కేసు నమోదు చేశాడు. కేసు నమోదు అనంతరం డీజే సౌండ్ సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన డీజే సౌండ్ సామాగ్రిని తిరిగి ఇచ్చేందుకు కేసు నమోదు కాబడిన వ్యక్తి నుండి ఎస్సై రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. సదరు బాధితుడు ఎస్సై వేధింపులు తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎస్సై శంకర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ఏసీబీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.