calender_icon.png 24 May, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలి

24-05-2025 04:54:59 PM

పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలనలో అదనపు కలెక్టర్ కోయ శ్రీహర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): పెండింగ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు(Additional Collector D. Venu) అన్నారు. శుక్రవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు, రాఘవ పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ డి.వేణు తనిఖీ చేశారు.‌ అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ... వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇప్పటివరకు 13 వేల 500  క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 3 వేల 500 క్వింటాళ్లు సైతం నాణ్యత ప్రమాణాలు రాగానే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ సెంటర్ ఇంచార్జికు సూచించారు.

తడిసిన ధాన్యం ఆరబెట్టిన తర్వాత తేమ శాతం రాగానే తూకం వేసి కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన గన్ని బ్యాగులు టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాఘవపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అదనపు హమాలీలను ఏర్పాటు చేసి పెండింగ్ ఉన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ 3 నుంచి 4 రోజులలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.