24-05-2025 05:06:59 PM
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం..
సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా గిరి ప్రసాద్ 29వ వర్ధంతి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కార్మిక, కర్షక, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నల్లమల గిరిప్రసాద్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడని, భూపోరాటాలకు నాయకత్వం వహించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన ఘనత గిరిప్రసాద్ కు దక్కుతుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం(CPI Rashtra Samithi member Mutyala Vishwanatham) అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు సిపిఐ మాజీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు నల్లమల గిరిప్రసాద్ 29వ వర్ధంతి శనివారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ఘనంగా నిర్వహించారు. తొలుత గిరిప్రసాద్ చిత్రపఠానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అప్పటి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ దృవతారగా వెలుగొందిన గిరిప్రసాద్ జీవితం, ఆయన చేసిన త్యాగం నేటి తరం కార్యకర్తలకు, నాయకులకు స్పూర్తిదాయకమని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలను నడిపించడంలో కీలకపాత్ర పోషించిన గిరిప్రసాద్ లేని లోటును పరిపూర్త చేయాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు.
నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేఖంగా ఆంధ్ర మహాసభ సాగించిన ఉద్యమం గురించి అద్యయనం చేసి ఉన్నత విద్యను, ఆస్తులను సైతం వదిలివేసి ఉద్యమబాట పట్టిన నల్లమల సాయుధ పోరాటాన్ని బలోపేతం చేశాడని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్వంచ తాలుకా కేంద్రంగా గెరిల్లా దళాలకు నాయకత్వం వహించిన ఆయన గిరి దళం పేరుతో గిరిజన ప్రాంతాల్లో ఉన్న పొడు భూమి సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ కు వ్యతిరేకంగా సాయుద పోరాటంలో తన దళ సభ్యులు సోయం గంగులు, ఉయ్యాల పుల్లయ్య, కోండ్రు చిన్న నాగులు, తదితర సహచరులుగా, పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, భూర్గంపాడ్, కొత్తగూడెం, ప్రాంతాలలో దళాలు జరిపిన దాడుల్లో గిరి ప్రసాద్ నాయకత్వం వహించిన గొప్ప ఆదర్ష నాయకుడన్నారు.
సీపీఐ పార్టీ రాష్ట్ర ,జాతీయ ఉప కార్యదర్శి గా, యంయల్ఎ, యంపీగా ప్రజలకు సేవలను అందించారని కొనియాడినారు. అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుుడిగా పనిచేసిన గిరిప్రసాద్ జిల్లా అభివృద్ధికి, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాడన్నారు. ఆయన చూపిన పోరాట మార్గంలో పయనిస్తూ నమ్మిన సిద్ధాంతాలను నెరవేర్చినప్పుడే నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, వీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.