calender_icon.png 24 May, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ ఒక్క రైతును నష్టపోనివ్వం..

24-05-2025 04:57:18 PM

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి తమ ధాన్యం తడిసిన ఏ ఒక్క రైతును నష్టపోనివ్వమని ఖానాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్(Market Committee Vice Chairman Majeed) అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా, దాంతో పాటు తూకంలో ఆలస్యం జరగకుండా, వర్షాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన ఏర్పాట్లు సమీక్షించి ఎప్పటికప్పుడు ధాన్యం సేకరించేలా అక్కడి కేంద్రాల సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయనతో పాటు మార్కెట్ కమిటీ సిబ్బంది కలిసి సుర్జాపూర్, బాదనకుర్తి, మస్కాపూర్, కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.