07-08-2025 01:10:00 AM
ములుగు,ఆగస్టు6(విజయక్రాంతి): ప్రతి నెల అర్హులందరికీ పెన్షన్ అందే విధంగా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సూచించారు బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ అమలుపై ఎంపీడీవోలకు మున్సిపల్ కమిషనర్ పంచాయతీ కార్యదర్శులకు బిల్లు కలెక్టర్లు మరియు పోస్టల్ డిపార్ట్మెంటకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పెన్షన్ కు అర్హత ఉన్న వారందరినీ ప్రతి నెల పెన్షన్ ఇప్పించే విధంగా కృషి చేయాలని అనహరులను గుర్తించి పెన్షన్ నుండి తొలగించాలని అలాగే ముఖచిత్రం ద్వారా పెన్షన్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముందుగా టీజీ సెర్ప్ పెన్షన్ డైరెక్టర్ గోపాల్ రావు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ఎం సంపత్ రావు చేయూత పెన్షన్ పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి డిపిఓ దేవ్ రాజ్,అదనపు డిఆర్డిఓ గొట్టే శ్రీనివాస్,ములుగు మున్సిపాల్ కమీషనర్ సంపత్,టీజీ ఆన్లైన్ ప్రతినిధి రాజు,జిల్లాలోని ఎంపీడీవోలు,సెర్ప్ డిపిఎంలు,ఏపిఎంలు,సి సీలు,పంచాయతీ కార్యదర్శులు హాజరైనారు.
బండారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ములుగు, ఆగస్టు6(విజయక్రాంతి): విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సూచించారు బుదవారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 9వ తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులలో ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్న తీరును గమనించారు.
ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. వంట గది, స్టోర్స్ రూమ్ తనిఖీ చేసిన కలెక్టర్,విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, ఉడకబెట్టిన కోడి గుడ్డును అందించాలని ఆదేశించారు. విద్యార్థులు అందరూ తరగతులకు ప్రతిరోజూ హాజరయ్యేలా చూడాలని అన్నారు. ప్రతి విద్యార్ధి ఒక గోల్ పెట్టుకోవాలని దానిని సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
విద్యా ర్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహ కులను ఆదేశించారు. భోజనం మంచిగా ఉంటుందా ?లేదా ? అని విద్యార్థులను ప్రశ్నించగా బాగా ఉంటుందని విద్యార్థులు కలెక్టర్ కు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ కమిటీ చాలా కీలక పాత్ర పోషించాలని,తప్పనిసరిగా కమిటీ సభ్యులు భోజనం తిని మంచిగా ఉందని నిర్ధారణ చేసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని ఆయన సూచించారు.