calender_icon.png 7 August, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం

07-08-2025 01:08:48 AM

  1. ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో కలెక్టర్లు

ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడవాలి..

జయంతి వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, మాజీ మంత్రి జోగు రామన్న పిలుపు 

నిర్మల్/ఆదిలాబాద్, ఆగస్టు ౬ (విజయక్రాంతి): కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం తెలంగాణ సైద్ధాంతిక కర్త ఆచా ర్య కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. మొదటగా అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటా నికి పూలమాలలు వేసి అంజలి ఘటించా రు.

ఈ జయంతి వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆజన్మాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ఉద్యోగులు, మేధావులు, కళాకారులకు, తెలంగాణ ప్రజానీకానికి తెలియ జెప్పి తెలంగాణలోని సబ్బండ వర్గాల ను ఏకం చేసి తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ముందుండి నడిపించారని అన్నారు.

దురదృష్టవశాత్తు స్వరాష్ట్ర సాధనను ఆయన చూడలేకపోయారన్నారు. నేటి తరం వారికి ప్రొఫెసర్ జయశంకర్ గొప్పతనాన్ని తెలియజేలాలని తెలిపారు. ఆచార్య జయశంకర్ ఆలోచనలు మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఎంతగానో కృషిచేశారని అన్నా రు.

ఆచార్య జయశంకర్ తెలంగాణ సిద్ధాంత కర్తగా, ఉద్యమకారునిగా, రచయితగా, ఎన్నో ఉన్నత చదువులు చదివిన మేధావిగా సుపరిచితులు అని చెప్పారు. అందరూ స్వరా ష్ట్రంలో ప్రో. జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.

ఈ జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, సిపిఓ జీవరత్నం, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఏవో సూర్యారావు, డీఐఈవో పరుశురాం, మెప్మా పిడి సుభాష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సిద్ధాంతకర్త  ప్రొఫెసర్ జయ శంకర్ 91వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుదవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా జయశంకర్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన గావించి, ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనం అందించే నిజమైన ఘన నివాళి అని అన్నారు. కార్యక్రమాలు ఆదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీవో స్రవంతి, పలువురు అధికారులు, పలువురు స్వర్ణకారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.  అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయ శంకర్ సార్ జయంతి వేడుకల ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ సురేందర్ రావ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  అటు బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జయశంకర్ సార్‌కు నివాళులర్పించారు. స్థానిక ఆ మహనీయుని విగ్రహానికి మాజీ మంత్రితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు.   

ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నీళ్లు, నిధులు, నియామకాలపై  ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి ఫలితమే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. ఎల్లప్పు డూ ప్రొ.జయశంకర్ సార్ ఆశయ సిద్ధాంతంలో పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్ర మంలో పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయశంకర్

మంచిర్యాల, ఆగస్టు 6 (విజయక్రాంతి) : తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రజా చైతన్యానికి విశేష కృషి చేసిన తెలంగాణ స్ఫూర్తి ప్రధాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వేడుకలలో అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా అధికారులతో కలిసి హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించా రు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమా లలో తన వంతు పాత్ర పోషించి ప్రజా చైతన్యానికి విశేష కృషి చేసిన తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో సదాస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.