calender_icon.png 17 November, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతిల్లు ప్రతి ఒక్కరికీ భరోసా

17-11-2025 01:52:09 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, నవంబర్16(విజయక్రాంతి):  సొంతిల్లు అనేది పేదలకు ఒక భరోసా లాంటిదని... ఆ ఇంట్లో తమకు కలిగిన గంజో, గట్కో ఇంత కారం మెతుకులు తిన్న తృప్తిగా ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండలం తల్లారం గ్రామం లో  లబ్ధిదారులు బొర్ర స్వాతి బంద్యయ్య  లు ప్రభుత్వం నుంచి మంజూరైన ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశం నిర్వహించారు.

ఇంటి గృహప్రవేశం ముఖ్య అతిథిగా కాలే యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పేదలకు సొంతిల్లు ఓ భరోసా మనకంటూ ఓ గూడు ఉంటే ఆ నీడన కారం, రొట్టె తిన్నా కూడా తృప్తిగా ఉంటుందని.. అసంతృప్తి అనేదే ఉండదని గట్టి నమ్మకం అన్నారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.