calender_icon.png 17 November, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో బాలోత్సవ్

17-11-2025 01:53:07 AM

ఘట్ కేసర్, నవంబర్ 16 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్లో బాలోత్సవ్ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి అనురాగ్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ అర్చనా మంత్రి, సీఈఓ ఎస్. నీలిమ పాల్గొన్నారు. ఈవేడుకకు ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ జి.వి.ఎస్. ఆనంతలక్ష్మి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ తారాసింగ్ ఠాకుర్, సోషల్ ఇమర్షన్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సి. మల్లేశ గౌరవ అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈఏడాది బాలోత్సవ్ వేడుకల్లో 20కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 600కు పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను వివిధ సాహిత్య, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను ప్రదర్శించారు. అనేక మంది విద్యార్థులు పురస్కారాలు గెలుచుకుని తమ పాఠశాలలకు గౌరవాన్ని తీసుకువచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వాహకుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యం వలన బాలోత్సవ్ 2025 అనురాగ్ యూనివర్సిటీలో చిరస్మరణీయంగా నిలిచింది.