దశాబ్ది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నాటి యు వత ఆకాంక్షలను నెరవేర్చే దిశగా నియామకాలు చేపట్టటంలో, రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందటానికి పెట్టుబడులను ఆకర్షించటంలో తనదైన ముద్ర వేసుకుంటోంది.
గత 15 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వం చూపెడుతున్న చొరవ పారదర్శకత, దేశీయ అంత ర్జాతీయ వేదికల ద్వారా పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలందుకుం టున్నాయి.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం, వివక్షత తెలం గాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. ప్ర త్యేక రాష్ట్రం ఏర్పాటయితే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయనే ఆకాంక్ష ఉద్యమంలో యువత ముందుండి పోరాడటానికి స్ఫూర్తినిచ్చింది.
తెలంగాణసాధనలో ఉద్యోగాలు ప్రధాన అంశమైతే, ఉద్యమ పార్టీ దశాబ్దపు పాలనను అధికారానికి దూరం చేసిందీ నిరుద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా నియామకాలు చేపట్టటం, రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా ప్రభుత్వం తన ప్రతిష్టను పెంచుకుందనే చెప్పాలి.
వేగం, పారదర్శకత
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పాటైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వేగం, పారదర్శకత రెండూ పెరి గినాయి. ఈ దశాబ్ద కాలంలో గత ప్రభు త్వం ఉద్యోగ నియామకాల పట్ల అనుసరించిన వైఖరి విమర్శల పాలైంది. నోటి ఫికేషన్ విడుదలలో జాప్యం, పరీక్షల నిర్వహణలో వైఫల్యం, ప్రశ్నాపత్రాల లీకేజి, ని యామకాలలో ప్రధాన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీటీజీపీఎస్‌సీ వైఫల్యం, నత్తనడకన కొనసాగిన నియామకాల ప్రక్రియతో ని రుద్యోగులు తీవ్ర ఆవేదన చెందారు.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం వివిధ వర్గాల నుండి వస్తున్న ఒత్తిడి ఫలితంగా 2023 శాసనసభ ఎన్నికలకు ముందు 2022లో 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ, 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం ప్రకటన చేసింది.
అంటే నాటి ప్రభుత్వం 80,000 ఉద్యోగాలు ఖాళీ అయ్యేదాకా నియామకాలు చేపట్టకుండా ఏమి చేసిందనే ప్రశ్నతో పాటు, ఎన్నికలకు ముందు నియామకాలు చేపట్టడానికి సిద్ధపడిందనే విమర్శల నూ ఎదుర్కొంది. మా ప్రభుత్వ హయాం లో 1,62,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు కానీ నోటిఫికేషన్ మినహాయి స్తే వాస్తవంగా భర్తీ చేసింది 80వేలకు మిం చి ఉండవు.
అలాగే టీజీపీఎస్‌సీ ద్వారా 35వేల ఉద్యోగాలు కూడా నాటి ప్రభు త్వం భర్తీ చేయలేకపోయిందనేది వాస్తవం. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించలేని వాటితోపాటు వివాదాలను పరిష్కరిస్తూ, కొత్త నోటిఫికేషన్‌లకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఇప్పటివరకు దా దాపు 57,946 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఇప్పటి కే 8143 గ్రూప్- 4 ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తే అన్ని న్యాయపరమైన వివాదాలను అధిగమించి గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3కు సంబంధించి 2734 ఉద్యోగ నియామకాలకు ఫలితాలు విడుదల చేశారు. అన్ని గ్రూప్ పరీక్షలు ద్వారా ఈ ప్రభుత్వం 10877 ఉద్యోగాల ను భర్తీ చేస్తోంది.
జూనియర్ లెక్చరర్, పా లిటెక్నిక్ లెక్చరర్స్‌గా ఎంపికైన 1532 మం దికి నియామక పత్రాలను అందజేస్తే, హాస్టల్ వార్డెన్ ఆఫీసర్‌గా ఎంపికైన 581 మందికి కూడా ఉద్యోగ నియామక పత్రాలను అందజేయబోతున్నారు. 14వేల అం గన్‌వాడీలను నియమించడానికి ప్రభు త్వం ప్రయత్నం చేయడంతో పాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెం డర్‌నుకూడా ఇప్పటికే ప్రకటించారు.
ఉద్యోగ నియామకాలలో వేగాన్ని పారదర్శకతను పెంచటానికి టీజీపీఎస్‌సీని ప్ర క్షాళన చేయటం, 56 రోజులలోనే డీఎ స్సీ నియామకాలు చేపట్టటం, 90 రోజులలో నే గ్రూపు-2 ఫలితాలను విడుదల చేయ టం, సంవత్సర కాలంలోనే గ్రూప్-1 నియామకాలు చేపట్టటం, అభినందనీయం.
మరొకవైపు ‘రాజీవ్ యువ వికా సం’ పథకంలో భాగంగా ఐదు లక్షల మం ది నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల ఆర్థి క సహాయం చేయటానికి రూ.6 వేల కోట్లను కేటాయించటం కూడా ఆహ్వానించదగినదే.
మరింత క్రియాశీలకంగా..
తెలంగాణ ఏర్పాటు నుండి ప్రభుత్వా లు రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టినాయి అయితే పెట్టుబడుల ఆకర్షణలో గత ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా వ్యవహరించటం వలన పెట్టుబడుల సాధనలో ప్రభుత్వం అంచనాలకు మించి పనిచేస్తోందనే అభిప్రాయం కలుగుతోంది.
గత ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసే,్త కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ) ప్రతిపాదనను పెట్టుబడిదారుల ముందుపెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైందనే చెప్పాలి.
రూ.2.5 లక్షల కోట్ల ఒప్పందాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత సీఎం తొలి దావోస్ సదస్సులో పాల్గొని ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ పే రుతో వివిధ దేశీయ, అంతర్జాతీ య సంస్థలతో 40,252 కోట్ల రూపాయ ల పెట్టుబ డి ఒప్పందాలు చేసుకుంటే , అమెరికా, ద క్షిణ కొరియా పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు, సిం గపూర్ పర్యటనలో 3500 కోట్ల రూపాయల ఒప్పందాలు, ఇటీవల దావోస్ వర ల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 1.78 లక్ష ల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందా లు మొత్తంగా రూ.2,53, 284 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకోగలిగారు.
ఈ పెట్టుబడులు మొత్తం కార్యరూపం దాల్చి తే లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించబడట మే కాదు హైదరాబాద్ ఐటీ, బయోసైన్సె స్, ఏఐ, సెమీ కండక్టర్ల పరిశ్రమల కేం ద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.
గత సంవత్సరం దావోస్ సదస్సులో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించగలిగితే ఈ ఏడాది ఏకంగా నాలు గు రెట్లు అధికంగా రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలిగాం. అంటే హైదరాబాద్, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడు ల పట్ల పెట్టుబడిదారులకు ప్రభుత్వం న మ్మకం కలిగించగలిగింది.
భవిష్యత్తులో తెలంగాణ కూడా మహారాష్ట్ర స్థాయిలో పెట్టుబడులను సాధించగలిగితే వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రంలో పారిశ్రామి కీకరణకు బలమైన పునాదులు పడే అవకాశాలు ఉన్నాయి.కులగణన, రైతు రుణమా ఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీల అమ లు లాంటి విషయాలలో గందరగోళం తలెత్తటం, రాష్ట్ర అవసరాలకు సరిపడా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోలేకపోవటం,
ఇప్పటికే 1.58 లక్షల కోట్ల రూపాయల అప్పులు తేవటం వలన ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలలోకి పోయినంతగా ప్రభు త్వ విజయాలు వెళ్లకపోవటం వలన రావలసినంత పేరు రావటం లేదు. ప్రభుత్వ కా ర్యక్రమాలను ప్రజలలోకి తీసుకపోవటం లో ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం, పా ర్టీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇదే విధ మైన వరవడి కొనసాగించాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్ : 9885465877