29-12-2025 04:01:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో ఐదో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రవేశల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రవేశ పరీక్ష పోస్టరు బ్యానర్లను ఆవిష్కరించారు. ఈనెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరించి పరీక్ష ప్రతిభ ఆధారంగా విద్యార్థులను గురుకుల పాఠశాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు సభ్యులు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీనాయక్ బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ ఆర్ డి ఓ రత్న కళ్యాణి అధికారులు పాల్గొన్నారు