29-12-2025 04:32:50 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని ఏజెన్సీ వాసులను చలి గడగడ వణికిస్తున్నది. వారం రోజుల నుంచి చలి రోజురోజుకు తీవ్ర మవుతున్నది. సాయంత్రం 5.00గంటలకే చలి మొదలవు తున్నది. ఉదయం 8 గంటల వరకూ పొగ మంచు వీడడం లేదు. చలి దూరం చేసేందుకు మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. అలాగే ఉదయం పూట మంచు దుప్పటి కప్పేస్తుంది. అన్ని ప్రధాన రహదారుల్లో ముందు మనిషి, ముందున్న రోడ్డు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించ నంతగా మంచు కమ్మేస్తుంది. దీంతో వాహనా చోదకులు అవస్థలు పడుతున్నారు.