calender_icon.png 29 December, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు చెబితే నేరం చేసినట్టా: ఐబొమ్మ రవి

29-12-2025 04:22:29 PM

హైదరాబాద్: పోలీసులు ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని ఐబొమ్మ రవి తెలిపారు. బెట్టింగ్ యాప్స్ తో సంబంధాలున్నాయని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానని రవి అంటున్నాడు. నా పేరు ఐ బొమ్మ రవి కాదు.. ఇమంది రవి అన్నాడు. పోలీసులు చెబితే నేరం చేసినట్టాని రవి ప్రశ్నించాడు. నేను ఎక్కడికీ పారిపోలేదు... కూకట్ పల్లిలోనే ఉన్నానని, వేరే దేశంలో సిటిజన్ షిప్ మాత్రమే తీసుకున్నానని రవి స్పష్టం చేశాడు. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానని రవి చెబుతున్నాడు.