calender_icon.png 29 December, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ కాటన్ మిల్ వద్ద పత్తి రైతుల ఆందోళన

29-12-2025 04:04:51 PM

ఆన్లైన్ బుకింగ్ లో భారీ తేడాతో రైతుల ఆందోళన

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం పత్తి రైతులు ఆందోళన చేప‌ట్టారు. రైతులు ఆన్ లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకొని,  తమ పత్తిని ట్రాక్టర్ల ద్వారా మిల్లు వ‌ద్ద‌కు తీసుకొని రాగా, తీరా చూస్తే ఆన్ లైన్ బుకింగ్ లో తేడాలు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక రైతు 50 క్వింటాళ్లు ఆన్ లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న రైతుకు తీరా కాటన్ మిల్ కి కాటన్ తీసుకొచ్చిన తరువాత 17 క్వింటాళ్లు, మరో రైతుకు 30 క్వింటాళ్లకు బదులుగా మూడు క్వింటాళ్లు,  రైతులందరికీ ఇదేవిధంగా చూపిస్తుండగా,

ఆన్ లైన్ లో చూపిస్తున్న ప్రకారం సీసీఐ అధికారులు కొనుగోలు చేస్తామని మార్కెటింగ్, సీసీఐ అధికారులు అన‌డంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతులు ధర్నా చేశారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ట్రాక్టర్లను కిరాయికి మాట్లాడుకొని, పత్తిని ట్రాక్టర్లలో ఎక్కించడానికి డబ్బులు చెల్లించి  కూలీలను పెట్టుకొని తొక్కించి కాటన్ మిల్ వద్దకు తీసుకు వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్స్ భారీగా నిలిచిపోయాయి.