29-12-2025 03:53:42 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయవద్దని ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్న దరఖాస్తు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రత్న కళ్యాణి అధికారులు ఉన్నారు