29-12-2025 04:36:34 PM
గాదె ఇన్నయ్య పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాష
వనపర్తి టౌన్: తెలంగాణ ఉద్యమ నేత ప్రముఖ రచయిత గాదె ఇన్నయ్య పై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని టీజేఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష సోమవారం ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్ ఘాట్ మండలం సాగరంలో అనాధ పిల్లల ఆశ్రమంలో గాదె ఇన్నయ్యపై కేసు పెట్టడం చాలా అన్యాయమన్నారు.
ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాజకీయాల్లో మన చుట్టూ జరుగుతున్న అంశాలపై స్పందించడం నేరం కాదన్నారు . నేరం రుజు కాకముందే శిక్ష ఖరారు చేసే వింత చట్టమే, యు ఏ పి ఏ ( ఊపా.)చట్టమని గాదె ఇన్నయ్యను అరెస్టు చేసి బయటకు రాకుండా చేయడం చాలా అన్యాయమన్నారు. గాదె ఇన్నయ్య ఆయన అనాథశ్రమాన్ని నడుపుతున్నారని 205మంది అనాథల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మానవత దృక్పథంతో గాదె ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు