calender_icon.png 29 December, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ అభిలాష అభినవ్

29-12-2025 04:11:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో యూరియా కొరత ఏమాత్రం లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. యూరియా నిల్వలు, సరఫరా తీరుపై అధికారులతో సమీక్షించిన అనంతరం సోమవారం కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ప్రస్తుతం రైతుల అవసరాలకు అనుగుణంగా 8 వేల మెట్రిక్ టన్నుల (MT) యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొందరు వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. యూరియా విక్రయ కేంద్రాల వ…