calender_icon.png 26 August, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

26-08-2025 06:23:42 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయకులను పూజించాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్య నియంత్రణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని, కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు.