calender_icon.png 26 August, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోధనోపకారణాల మేళాను ప్రారంభించిన సబ్ కలెక్టర్ మనోజ్

26-08-2025 06:20:30 PM

బెల్లంపల్లి అర్బన్:  మంచిర్యాల జిల్లా మండల స్థాయి బోధనోపకరణాల మేళా బెల్లంపల్లి కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ బోధ నోపకరణాల మేళాను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ప్రారంభించి ప్రతి బోధనో పకరణాలను పరిశీలించి ఉపాధ్యాయుల సృజనాత్మకతను అభినందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి యాదయ్య, సెక్టోరియల్ ఆఫీసర్ ఏ. సత్యనారాయణమూర్తి,కే. చౌదరి  జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగ కార్యదర్శి పి. మహేశ్వర్ రెడ్డి, మండల విద్యాధికారి జే.పోచయ్య, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జి‌. రఘుబాబు, జె.దామోదర్ హాజరై ప్రదర్శనలను పరిశీలించి సూచనలు చేశారు.

ఈ సందర్భంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ ఇలాంటి బోధనోపకరణాలు విద్యార్థుల్లో అభ్యాసనం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని అన్నారు. విద్యా ప్రమాణాల  మెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయని ప్రతి పాఠశాలలో బోధనోపకరణాల వాడకాన్ని ప్రోత్సహించాలని,బోధనోపకరణాలు విద్యార్థి కేంద్రీకృత బోధనలో కీలకపాత్ర పోశిస్తాయన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి పాఠశాలలో బోధనోపకరణాలను వినియోగించి విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా బోధించాలనినన్నారు.