17-07-2025 12:15:09 AM
వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే యాదయ్య
చేవెళ్ల జూలై 16: 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం వనమహోత్సవ కార్యక్రమం చేవెళ్ల పట్టణంలోని మోడల్ కాలనీ, ఓపెన్ స్పేస్ ఆలూరులో మొక్కలు నా టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ‘మియావాకి - కాన్సెప్ట్ ప్లాంటేషన్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు ఎకరం విస్తీర్ణంలో 3వేల 2వందల మొక్కలు నాటారు.
అనంతరం ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ... మియావాకి - కాన్సెప్ట్ ప్లాంటేషన్ సంస్థ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎమ్మెల్యే అభినందించారు. పర్యావరణ పరిరక్షణ భాగంగా 100 రోజుల వన మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పర్యావరణ పరిరక్షణ వాతావరణ సమతుల్యత కాపాడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
వాతావరణంలో అ తివృష్టి అనావృష్టికి కారణం పర్యావరణ సమతుల్యత లేకపోవడమే కారణమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పెంటయ్య గౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ బేగరి రా ములు, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, మాజీ సర్పంచ్ లు దల్గారి గోపాల్ రెడ్డి,
జనార్దన్ రెడ్డి, నర్సిములు, మాజీ ఎంపిటీసిలు సున్నపు వసం తం, గుండాల రాములు, బక్కరెడ్డి రవీందర్రెడ్డి, చేవెళ్ల పిఏసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ముడిమ్యాల పిఏసిఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూకన్న గారి లక్ష్మారెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, నాయకులు నరేందర్ లు తదితరులు పాల్గొన్నారు.