calender_icon.png 18 July, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల, వైద్యశాలలో అదనపు కలెక్టర్ తనిఖీలు

17-07-2025 09:07:24 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీఎం శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, గ్రామపంచాయతీని జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గురువారం తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పరిసరాలను పరిశీలించి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. సబ్ సెంటర్లవారీగా ఆరోగ్య వివరాలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడ డిజిటల్ విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను బోధన తీరుపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న అధునాతనమైన విద్యాబోధన గురించి ప్రచారం చేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామపంచాయతీని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.