calender_icon.png 18 July, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందులో జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు

17-07-2025 08:45:10 PM

రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో గురువారం జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో భాగంగా జరిగిన  బహిరంగసభలో రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి అనసూర్య (సీతక్క) లతో పాటు రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు లబ్దిదారులకు రేషన్ కార్డులు, ఇళ్ళ పట్టాల పంపిణి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.