17-07-2025 08:57:41 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో శుక్రవారం జరిగే రాష్ట్ర రెవె న్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 11 గంటల కు బూర్గంపాడు మార్కెట్ యార్డ్ లో నియోజకవర్గ స్థాయి ఇందిర మహిళశక్తి సంబరాలు కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు.