17-07-2025 08:53:11 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణ సమీప గోదావరి నదీ తీరాన గంగా దేవి బోనాల జాతరను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మత్స్య లైసెన్స్ మార్కెటింగ్ సహకార సంఘాలు, వేములపల్లి, ఎల్ఐసి కాలనీ, రాంనగర్ సహకార సంఘాలు, తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వేములపల్లి నుంచి మంచిర్యాల పట్టణ పురవీధుల మీదుగా ఊరేగింపుగా బోనాలతో మహిళలు వారి కుటుంబ సభ్యులతో వచ్చి గోదావరి నది ఒడ్డున మొక్కులు చెల్లించారు. వాగులు, వంకలు, చెరువులు నిండి గోదావరి ప్రవహించే విధంగా వర్షాలు కురువాలని వేడుకున్నారు.