calender_icon.png 18 July, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలి

17-07-2025 09:12:16 PM

కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి 

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విదంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లాలో చింతపల్లి, దేవరకొండ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న రాజారాం నాయక్, రవి నాయక్ లకు కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పట్టీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు.

పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ  ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని  జిల్లా ఎస్పీ  సూచించారు. పోలీసు స్టేషనుకు వచ్చే పిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడుతూ సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తూ తమకు అప్పగించిన విధులను క్రమ శిక్షణతో బాధ్యతతో పని చేయాలని అన్నారు.అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందన అన్నారు.