calender_icon.png 20 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల, బాలికల సమానత్వం అమ్మఒడి నుంచే సాధ్యం..!

25-01-2025 12:32:56 AM

ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్‌రెడ్డి

నాగర్ కర్నూల్, జనవరి 24: సమాజంలోని మహిళల పట్ల జరుగుతున్న వివక్షత పోవాలంటే అమ్మ ఒడిలోనే బాల బాలికలు ఇరువురూ సమానమే అనే విధం గా మెలగాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాలిక దినోత్సవం పురస్కరిం చుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని హాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు సమాజంలో కుటుంబానికి గౌరవ ప్రతిష్టలు పెంచేందుకు మహిళల చదువు ఎంతో దోహదం చేస్తుందన్నారు. బాలికలు విద్యలో రాణిం చడంతోపాటు ఆత్మరక్షణకు కరాటేలోనూ ప్రతిభ కనబర్చాలన్నారు.   

నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తు న్నారని ప్రతి కుటుంబంలో ఆడపిల్లల విద్యను ప్రోత్సహించాలని కోరారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే విద్య వల్లే సాధ్యమవుతుందన్నారు.

ప్రభు త్వం బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని రాజేశ్వరి, డిఈవో రమేష్ కుమార్, డిపిఓ రామ్మోహన్, వైద్యాధికారి రవికుమార్ తదితరులు ఉన్నారు.