20-08-2025 10:30:07 PM
క్రీడాకారులు మండలానికి మంచి పేరు తేవాలి
తాజా మాజీ సర్పంచ్ మామ్మాయి సంజీవ్ యాదవ్
గాంధారి,(విజయక్రాంతి): క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని ఓడిన నిరుస్తా పడకుండా పట్టుదలతో ముందుకు సాగాలని గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవులు యాదవ్ అన్నారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ నుండి కొత్తగూడెంలో జరిగే కబడ్డీ, వాలీబాల్ పోటీలలో పాల్గొనే రెండు జట్లకు మండల కేంద్రంలోని శ్రీ సాయి హాస్పిటల్ తరఫున క్రీడాకారులకు టీ షర్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కొత్తగూడెంలో జరిగే కబడ్డీ, వాలీబాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గాంధారి మండలానికి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. గెలిస్తే ఆనందపడకుండా,ఓడిన నిరుస్తా పడకుండా విజయం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు.