calender_icon.png 20 August, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు ఫ్యాన్లు వితరణ

20-08-2025 09:59:41 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల పరిధిలోని మోరపల్లి బంజరు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలకు బుధవారం బంజరు గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ వారు రెండు సీలింగ్ ఫ్యాన్లు అందించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ..  ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా చేయూత ట్రస్ట్ నుండి సీలింగ్ ఫ్యాన్లు అందించడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.