20-08-2025 10:03:49 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎంఈవో నాగారం శ్రీనివాస్ బుధవారం ఉల్లాస్ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ... మండలంలోని అందరని అక్షరాస్యులను చేయ్యాలనే ఆలోచనలో భాగంగా నవభారత్ సాక్షరతా కార్యక్రమం పేరుతో చదవడం రాయడం నేర్పబడుతుంది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని వయోజనులను అక్షరాస్యులను చేయుట ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎంఈవో నాగారం శ్రీనివాస్ అన్నారు.
ఇందులో జీపీ పరిధిలోని ఒక ఉపాధ్యాయులు, స్వయం సహాయక బృంద సభ్యులు వివోఏలు కలిసి చదువు రాని వారిని గుర్తించి వారికి చదవడం, రాయడం నేర్పిస్తారని అన్నారు. వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతిలో అడ్మిషన్లు ఇప్పించి పదో తరగతి పరీక్షకు సన్నద్ధం చేస్తారన్నారు. తదుపరి ఇంటర్ మీడియట్ కు కూడా సిద్ధం చేస్తారని, దీని వలన అందరూ చదవడం, రాయడం నేర్చుకున్న వారుగా తయారవుతారని అన్నారు.