calender_icon.png 21 August, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామన్ రావు దంపతుల హత్య కేసులో హంతకుడు పుట్ట మధు

20-08-2025 10:25:08 PM

మంథని,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వంలో వామన్ రావు దంపతుల హత్య కేసులో త్వరలో జరగనున్న సిబిఐ విచారణలో హంతకుడిగా మారనున్న పుట్ట మధుకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఆ తర్వాత లేదని టిపిసిసి ఎన్నికల కమీటి సభ్యులు కాచే అన్నారు. బుధవారం మంథనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  కామన్ రావుల దంపతుల ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసి తప్పించుకున్న మాజీ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే పుట్ట మధుపై ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వామన్ రావు హత్య కేసులో నుంచి తప్పించుకున్నాడని, తన కొడుకు కూడలను పుట్ట మధు అతని భార్య అండదండలతోటే హత్య చేశారని వాహనరావు తండ్రి తండ్రి సుప్రీంకోర్టులో వేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ విచారణలో త్వరలోనే దోషిగా  మారనున్న పుట్ట మధు  కాంగ్రెస్ పార్టీని విమర్శించే హర్వత లేదని  శశిభూషణ్ కాచే అన్నారు. గోదావరి నది పై నిర్మించిన ప్రాజెక్టులు నాణ్యత లోపంతో కృంగిపోతే మంత్రి శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ సంబంధం ఎలా ఉంటుందని ఆయన విమర్శించారు.

మీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్ల వెచ్చించి, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, గొప్పలు చెప్పుకున్న మీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు రెండు ఏళ్లలో నాణ్యత లోపంతో కృంగిపోతే దానికి బాధ్యులు మీ సీఎం కేసీఆర్,  అప్పటి మంత్రి హరీష్ రావు మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో  2002లో కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకొని, మీరు నిర్మించిన ప్రాజెక్టులోకి నీళ్లు వదిలితే మంథని ప్రాంతాన్ని నిండా ముంచిందని, కానీ మీ ప్రభుత్వంలో రూ.కోటి నష్టం జరిగిన మంతిని ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదన్నారు.

ఇప్పుడు రాజకీయం కోసం ప్రాజెక్టుల వద్దకు వెళ్లి గోదావరి నీళ్లు వృధా పోతున్నాయని పుట్ట మధు ఆరోపించడం ఆయన విద్యుత్కే వదిలేస్తున్నామన్నారు. వర్షాకాలంలో వర్షాలు కురిసి గోదావరి నదిలో అధికంగా నీరు వస్తే నీటిని సముద్రంలోకి వదలకుండా ఎలా ప్రాజెక్టులో ఉంచుతారని ఆయన ప్రశ్నించారు. అలా మీరు ఉంచినందుకే మంథని ప్రాంతం మునిగిపోయిందని కాచే విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.