calender_icon.png 21 August, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా లత

20-08-2025 10:08:25 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే ఆశ వర్కర్స్  యూనియన్ అధ్యక్షురాలిగా తాడూరి లత పూర్తి మెజార్టీతో ఎన్నికయింది. బుధవారం పట్టణంలో  సిఐటియు కార్యదర్శి ఎడ్ల  రమేష్, ఆశ వర్కర్ల జిల్లా యూనియన్ కార్యదర్శి మారేలి లత  ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించారు. మండలంలో మొత్తం 59 మంది ఆశా వర్కర్లు ఉండగా వారిలో 56 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. వీరిలో 56 మంది ఓట్లు తాడూరి లతకు రావడంతో అధ్యక్షురాలిగా సంపూర్ణ మెజారిటీతో గెలిచింది.

ప్రధాన కార్యదర్శిగా శాలపల్లికి చెందిన సుజాత, కోశాధికారిగా పుష్పలత (పోతిరెడ్డిపేట) కార్యవర్గ సభ్యురాలుగా జంగా అరుణ (బోర్నపల్లి)తో పాటు పలువుని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎన్నికైన తాడూరి లతా మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 20 ఏళ్లుగా  గ్రామాల్లో చాలీచాలని  పారితోషకముతో పనిచేస్తున్న ఆశ వర్కర్లపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తా ఉన్నాయని అన్నారు. ఆశ వర్కర్ల న్యాయమైన హక్కుల సాధనకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.