20-08-2025 10:33:41 PM
జుక్కల్,(విజయక్రాంతి): భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ భీమ్ ఆర్మీ జిల్లా ఇంచార్జ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు టి.ఎన్ రమేష్ రావణ్ కామారెడ్డి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా బత్తిని గంగాధర్, (బాన్సువాడ నియోజకవర్గం), జిల్లా ఉపాధ్యక్షులుగా, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జిగా, మేకల సాయిలు, (పాత బాన్సువాడ)జిల్లా కార్యదర్శిగా, గడ్డం విజయ్ జుక్కల్ నియోజకవర్గం ఇన్చార్జిగా (జుక్కల్ నియోజకవర్గం), జిల్లా సంయుక్త కార్యదర్శిగా పవర్ కిషన్ (ఎల్లారెడ్డి నియోజకవర్గం), జిల్లా కమిటీ సభ్యులుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా జగ్గ సాయిలు, (ఎల్లారెడ్డి పట్టణం), జిల్లా కమిటీ సభ్యులుగా, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా గణేష్ ను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారతదేశంలో 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా భీమ్ ఆర్మీ ని బలపరచాలని అన్నారు.