13 June, 2026 | 2:34 PM

Breaking News

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •  

తెలంగాణలో ఉత్పత్తి పరిశ్రమను స్థాపించండి

10-10-2024 12:00 AM

‘టెర్రెయిన్ ఫ్యాషన్స్’ను కోరిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఇండియన్ టెర్రెయిన్ ఫ్యాషన్స్ సంస్థ తెలంగాణలో వస్త్రాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఇండియన్ టెర్రెయిన్ 196వ షోరూంను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ఆదిలాబాద్‌లోని 80 వేల మంది రైతుల నుంచి సేకరించిన సేంద్రీయ పత్తితో ఆ సంస్థ ఏటా నాలుగు కోట్ల మీటర్ల నూలు వస్త్రాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన పత్తితో పాటు, నైపుణ్య మున్న యువ త అందుబాటులో ఉన్నందున దుస్తుల ఉత్పత్తికి తెలంగాణ అనుకూలమన్నారు.

వేల మందికి ఉపాధి కల్పిస్తున్న షోరూం యజమాని అంకన్నగారి ఉత్కర్శ్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్, కాంగ్రెస్ నేత, క్రికెటర్ అజారుద్దీన్, పీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్, ఇండియన్ టెర్రెయిన్ ఎండీ చరత్ నరసింహన్, సీవోవో షెహనాజ్, జోనల్ మేనేజర్ ప్రవీణ్ బింగి పాల్గొన్నారు.