15 March, 2026 | 8:25 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు

24-10-2025 01:17 AM
  1. మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి 

రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం 

చొప్పదండి, అక్టోబర్23(విజయక్రాంతి):గంగాధర మండలం తో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న ది కావడంతో చాలామంది పేద విద్యార్థులు చదువును ఇంటర్మీడియట్ తోనే ఆపేస్తున్నారు.

నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్న సదుద్దేశంతో మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు.

గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏ ర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం. గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు విద్యార్థుల కృతజ్ఞతలుతెలిపారు.