24-10-2025 01:18:27 AM
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంట కు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి కురుస్తాయని స్పష్టం చేసింది.