న్యూ బోయిన్‌పల్లిలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు..
బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్
సికింద్రాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): న్యూ బోయినపల్లిలో ప్రభుత్వ జూనియ ర్ కళాశాల ఏర్పాటు కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చర్యలు తీసుకుంటున్నారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ బాలుర జిల్లాపరిషత్ పా ఠశాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచన మేరకు విద్య శాఖ అధికారి పాఠశాలను సందర్శించి జూనియర్ కళాశాల ఏర్పాటు సాధ్య సాధ్యాలను పరిశీలించారు.
అనంతరం జంపన ప్ర తాప్ మాట్లాడుతూ రెండవ అంతస్తులో పది తరగతి గదులు ఖాళీగా ఉన్నందున జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలనీ తాను ఇటీవల ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే శ్రీ గణేష్ విద్యాశాఖను పర్యవేక్షించే అధికారి పాఠశాల పరిశీలన చేసినట్లు చెప్పారు. అధికారులు నివేదిక అందజేసిన అనంతరం ప్ర భుత్వం అనుమతి ఇస్తే న్యూ బోయిన్ పల్లిలో జూనియర్ కళాశాల ఏర్పాటవుతుందని జంపన ప్రతాప్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో షకీబ్, రమేష్, రాజు, ముకేశ్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






