calender_icon.png 10 July, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పాపాలను దేవుడూ క్షమించడు

06-12-2024 01:50:34 AM

  1. బీజేపీలో బీఆర్‌ఎస్ కలుస్తుంది 
  2. కేటీఆర్‌కు కనీస జ్ఞానం కూడా లేదు 
  3. టీజీఎండీసీ చైర్మన్ ఈరావత్రి అనిల్‌కుమార్  

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పాపాలను దేవుడు కూడా క్షమించడని మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్‌కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల వరకు బీఆర్‌ఎస్ ఉంటదో, గంగల కలుస్తుందో లేదా బీజేపీలో కలుపుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించా రు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రె స్ నుంచి అధికారం గుంజుకోవాలని బావాబామ్మర్దులు హరీశ్‌రావు, కేటీఆర్ దుర్గార్గపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.

అధికారం కోల్పోయా క కూడా వాళ్లకు బుద్ది, జ్ఞానం లేకుం డా పోయిందని ఎద్దేవా చేశారు. రోజూ ఏదో అయినట్లు రోడ్డుమీద పడి హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మంత్రిగా పనిచేసిండా? సినిమా వాళ్లతో తిరిగాడా? అని అనుమానపడాల్సి వస్తుందని అనిల్ వ్యాఖ్యానించారు. మంత్రిగా పనిచేసినా కనీస జ్ఞానం కూడా లేదని దుయ్యబట్టారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను కేసీఆర్ కుటుంబం మోసం చేసిందని ఆరోపించారు.

11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు అప్పులు చేసిందని కేటీఆర్ విమర్శలు చేయడంలో వాస్తవం లేదన్నారు. సంక్షేమం అమలు కోసం కేవలం రూ. 52 వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందని పేర్కొన్నారు. పదేళ్ల అధికారంలో చేసిన అప్పుల చిట్టాను ప్రజలకు ఎందుకు చెప్పలేదని కేటీఆర్ ఆయన నిలదీశారు.