calender_icon.png 10 July, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోళ్లు కూడా మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూడగలగాలి

09-07-2025 12:00:00 AM

కార్తీక్‌రాజు, నోయల్, మిస్తి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ఎం పూర్ణా నంద్  దర్శకత్వంలో త్రిపుర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. ఆమని, కాశీ విశ్వనాథ్,  పృథ్వీరాజ్, సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేశ్, జెమిని సురేశ్, నోయల్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా జూలై 11న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుం ది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఈ వేదికపై ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కేఎల్ దామోదర్‌ప్రసాద్ ఆవిష్కరించారు. ఇక ప్రోమోస్‌ను ప్రముఖ నటుడు ఓ కల్యాణ్ విడుదల చేయగా, జబర్దస్త్ ఆర్‌పీ చేతుల మీదుగా పాట లు రిలీజ్ అయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పూర్ణానంద్ మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీ ప్యాక్ చిత్రమిది.

అందరినీ ఆహ్లాదపరిచే కామెడీ, ఉంది. సోసి యో ఫాంటసీగా దీన్ని మలిచాం’ అని చెప్పా రు. ‘అన్ని ఎమోషన్స్ ఉన్న చక్కటి చిత్రమిద’ని చిత్ర నిర్మాత మురళీకృష్ణ తెలిపారు. ఈ చిత్రాన్ని నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లలో విడుదల చేస్తున్న నిర్మాత నట్టి కుమా ర్ మాట్లాడుతూ.. “చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు చిత్ర పరిశ్ర మ, రెండు తెలుగు రాష్ర్ట ప్రభుత్వాలు పూనుకోవాలి.

చిన్న సినిమాకు 2-30 గంటల షోను కేటాయించాలి. మల్టీఫ్లెక్స్‌లలో పేదవాడు కూడా సినిమా చూసేలా ఆక్యుపెన్సీలో 20 శాతం టిక్కెట్ రేట్లను రూ.75గా నిర్ణయించాలి” అన్నారు.  ఇంకా ఈ కార్యక్రమంలో ఓబీ కల్యాణ్, నటుడు జెమి నీ సురేశ్, గీత రచయిత రాంబాబు గోషాల పాల్గొన్నారు.