calender_icon.png 10 July, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నప్ప ఆధ్యాత్మికతకు ఓ గొప్ప రూపం

09-07-2025 12:00:00 AM

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన పాన్‌ఇండియా పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోం ది. జూన్ 27న విడుదలైన ఈ సినిమాఅన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ‘కన్నప్ప’ స్పెషల్ షో ను మంగళవారం నిర్వహించారు. ప్రముఖ గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటయ్యింది.

ఈ షోకు మోహన్‌బాబు హాజరై, నాగ సాధువులు, అఘోరాలు, సాధువులు, యోగినిలు, మాతాజీలుతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, “ప్రతి చోట ‘కన్నప్ప’కి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. గజల్ శ్రీనివాస్ నిర్వ హించిన షోలో అఘోరాలతో కలిసి సినిమా చూడడం ఒక ప్రత్యేక అనుభూతి.

న్నప్ప ప్రయాణం ఇలానే సాగుతుంటే ఇది ఓ చరిత్రాత్మక విజయం అవుతుంది” అని అన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఓ భక్తుని జీవితం వెండితెరపై తీసుకురావడం గొప్ప విషయం. ఆధ్యాత్మికతకు ఓ గొప్ప రూప మే ఈ సినిమా. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. కన్నప్ప జీవితాన్ని మరోసారి అద్భుతంగా తీసిన నిర్మాత మోహన్‌బాబుకు ధన్యవాదాలు. ‘కన్నప్ప’ సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.