calender_icon.png 10 July, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తపల్లిలో ఒకప్పుడు.. సావిత్రి!

09-07-2025 12:02:25 AM

రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సమర్పణలో వస్తున్న తాజాచిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయమవుతోంది. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో ప్రవీణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మేరకు టీమ్ ఈ చిత్రంలో ప్రవీణ పరుచూరిని ‘సావిత్రి’గా పరిచయం చేస్తూ మంగళవారం ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది.

పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తగ్గట్టు ప్రవీణ పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించిందీ పోస్టర్‌లో. ఈ సినిమా జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి గీత సంగీతం: మణిశర్మ; నేపథ్య సంగీతం: వరు ణ్ ఉన్ని; డీవోపీ: పెట్రోస్ ఆంటోనియాడిస్; ఎడిటర్, క్రియేటివ్ డైరెక్టర్: కిరణ్ ఆర్; సమర్పణ: రానా దగ్గుబాటి; నిర్మాతలు: గోపా లకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి; కథ, మాటలు: గురుకిరణ్ బత్తుల; దర్శకత్వం: ప్రవీణ పరుచూరి.