15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భీంగల్‌ని అభివృద్ధి చేసినా ప్రజలు కనికరించలేదు

21-02-2026 12:49 AM

బస్‌డిపోని వెంటనే జరిపించాలి: బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్, ఫిబ్రవరి20 (విజయ క్రాంతి): ప్రత్యేకంగా  దృష్టి కేంద్రీకరించి భీమ్‌గల్ పట్టణాన్ని కోట్ల కోట్ల రూపాయలతో అన్ని విధాల అభివృద్ధి పరిచి సుందరంగా తీర్చిదిద్దినప్పటికిని ప్రజలు కనికరించలేదని మున్సిపల్ ఎన్నికల్లో  తమపై దయ చూపలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  ఆవేదన తన వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం, కొత్త కౌన్సిలర్లు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇప్పటికే 80 శాతం పూర్తయిన 100 పడకల ఆస్పత్రిని, 70శాతం పూర్తయిన నూతన మార్కెట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.  భీంగల్ బస్ డిపో ని కూడా వెంటనే తెరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమ్గల్లో ఏర్పాటు చేసిన విలేక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ పదవి చేజారడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.  ప్రజాపక్షాన పోరాటం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికిని ప్రజల పక్షాన బిఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విజయం వచ్చినా, అపజయం ఎదురైనా బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తూనే, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మన్నారు.  స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో  గెలిచినా, ఓడినా కౌన్సిలర్ అభ్యర్థులందరరి తో కలిసి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

బస్ డిపోను తెరిపించాలి..

మూతపడిన భీమ్గల్ బస్ డిపో ను వెంటనే తెరిపించి, బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మంజూరు చేసిన రూ.11.5 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత గెలిచిన కౌన్సిలర్లపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, పార్టీ ముఖ్య నేతలు, నూతన కౌన్సిలర్లు పాల్గొన్నారు.