కేటీఆర్ క్షమాపణ చెప్పినా రాజకీయం చేస్తున్నరు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాం తి): తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్షమాపణ చెప్పారని, ఆయన తీరును మహిళా లోకం స్వాగతిస్తోందని మాజీ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, సురభి వాణీదేవితో కలిసి మాట్లాడారు. కేటీఆర్ క్షమాప ణ చెప్పినా కొందరు కాంగ్రెస్ మహిళా నేత లు, మహిళా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎనిమి ది నెలలుగా రాష్ర్టంలో మహిళలపై 1800 లైంగికదాడులు జరిగాయన్నారు.
మహిళల పై నేరాలు ఘోరాలు జరుగుతున్నా స్పందించని మహిళా కమిషన్ కేటీఆర్ మాటలపై వేగంగా ఎలా స్పందించిందని ప్రశ్నించారు. లైంగికదాడులకు గురైన మహిళలను మం త్రులు, మహిళా కమిషన్ సభ్యులు ఏనాడైనా పరామర్శించారా అంటూ నిలదీశారు. గతంలో ఆసెంబ్లీ సాక్షిగా డీకే అరుణకు కేటీఆర్ తో కేసీఆర్ క్షమాపణ చెప్పించారని, ఇది తమ పార్టీకి ఉన్న సంస్కారమని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రసంగి స్తూ సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినపుడే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అవమానం చేసిందన్నారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ,హరీశ్ రావులను సీఎం,కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ క్షమాపణ చెప్పినా మహిళా మంత్రులు రాజకీయం కోసమే మాట్లాడుతున్నారని, హరీశ్ రావు లక్ష్యంగా ఆయన క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం పిరికి పందల చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






