17 June, 2026 | 10:54 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

రుణమాఫీ కాలేదని కదం తొక్కిన రైతులు

18-08-2024 12:33 AM

బ్యాంకులను ముట్టడించిన అన్నదాతలు

రోడ్లపై ముళ్లకంచెలు వేసి రాస్తారోకో

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

జంగంపల్లిలో సెల్‌టవర్ ఎక్కిన రైతు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, ఆగస్టు 17: రూ.2 లక్షల రుణమాఫీ పథకానికి తాము అర్హులమైనప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో శనివారం రైతులు నిరసనలు చేపట్టా రు. బ్యాంకులను ముట్టడించి అధికారులను నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్, బోథ్ మండలాల్లో బ్యాంకులను రైతు లు ముట్టడించారు. జైనథ్ మండలంలో జాతీయ రహదారిపై ముళ్లకంచె వేసి రైతు లు రాస్తారోకో చేపట్టారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామం లో మహారాష్ట్ర బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామ కెనరా బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరెపల్లి తండా కు చెందిన కేతావత్ రవి రుణమాఫీ కాలేదని భిక్కనూరు మండలం జంగంపల్లిలో సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. నిజామా బాద్ జిల్లా వేల్పూర్ చౌరస్తాలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో కరీంనగర్ రాజీవ్ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు.