calender_icon.png 4 October, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి: మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి

04-10-2025 05:47:38 PM

మక్తల్: రాబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మక్తల్ మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మక్తల్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మక్తల్ ద్వారక ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేసి ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు ,మాజీ ఉప సర్పంచ్ కట్ట సురేష్, మత్స్యశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు కోళ్ల వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాసులు, రంజిత్ రెడ్డి, ఫయాజ్, బిల్డర్ థాయప్ప, కావలి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.